Tiger Tention In Adilabad
mictv telugu

చారలను బట్టే ఏ పులి అనేది చెప్పేస్తారు

November 17, 2022

Tiger Tention In Adilabad

అడుగు బయట పెట్టాలంటే భయం..పొలాల్లోకి వెళ్లాలంటే వణుకు. ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందేమోనని టెన్షన్.పెద్ద పులుల భయంతో మూడు జిల్లాలు భయాందోళనలో ఉన్నాయి. జనావాసాల్లోకి పులులు ఎందుకు వస్తున్నాయి? పులులను ఎలా గుర్తిస్తారు? అది ఏ పులి అనేది ఎలా కనిపెడతారు?చారల్లో తేడాలే వాటిని గుర్తించేలా చేస్తాయా?

బెబ్బులి భయపెడుతోంది…

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి కలకలం రేపింది. ఓ వ్యక్తి పై దాడి చేసి చంపేసింది. పొలాల్లో తిరుగుతూ రైతుల్ని హడలెత్తిస్తుంది. మూడు జిల్లాలు, 8 మండలాలు,18 గ్రామాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. పులి సంచారంతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. రాత్రిళ్లూ జాగారం చేస్తున్నారు. ఖానాపూర్ , గోవిందపూర్ , చౌహన్ గూడ అటవీ ప్రాంతాల్లో స్థానికులకు పులి కనిపించడంతో వణికిపోతున్నారు.

Tiger Tention In Adilabad

35 కెమెరాలు, 50 మంది టైగర్ ట్రాకర్స్

కొమురంభీం జిల్లా ఖానాపూర్ శివారు సిడాం భీమును పులి చంపేసింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. తాజాగా దగేహాం మండలం ఖర్జిలో పశువుల మందపై దాడి చేసింది. భీంపూర్ , తాంసి , జైనథ్ మండలాల పరిదిలోని పెనుగంగ తీరం వెంట ఏకంగా నాలుగు పులులు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పులి కోసం ట్రాకింగ్ చేస్తున్నారు. 20 మంది ప్రత్యేక బృందంతో గాలిస్తున్నారు. 35 కెమెరాలు, 50 మంది టైగర్ ట్రాకర్స్ పులి సంచార ప్రాంతాల్లో అన్వేషణ జరుపుతున్నారు.
పాదముద్రల ఆధారంగా పులా కాదా అన్నది గుర్తించలేకపోతున్నామని ఆసిఫాబాద్ అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే తప్ప పులి దాడి అని పక్కాగా చెప్పలేమన్నారు.

పులి చారల్లో సైతం తేడాలు

ఈ పులులను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పులి చారల్లో సైతం తేడాలు ఉంటాయి. ఈ చారలను బట్టే దాడి చేసిన పులి ఏ రకం అనేది గుర్తిస్తారు. పుట్టిన ప్రదేశం, ఏరియా, ఆవాసాన్ని బట్టి పేరు చెప్పేస్తారు.పాదముద్రల సైజుని బట్టి ఏ పులి అనేది గుర్తిస్తారు. పులి పాదముద్రలు 11 సెంమీటర్ల కంటే ఎక్కువ ఉంటాయి. చిరుత పాదముద్రలు 11 సెం.మీ.కంటే తక్కువ ఉంటాయి.