ఆర్డర్..ఆర్డర్..పులిపోయి ఆవు వచ్చేనా..? - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్డర్..ఆర్డర్..పులిపోయి ఆవు వచ్చేనా..?

May 31, 2017

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుంది.పశువధ బ్యాన్ ఏదో గానీ అడవిలో వేట కొనసాగిస్తూ ప్రశాంతంగా ఉన్న పులిని కెలికారు. జాతీయ జంతువుగా ఉన్న స్టేటస్ సింబల్ కే ఎసరు పెడుతున్నారు. ఆవును జాతీయ జంతువు చేయాలని డిమాండ్లు పుట్టుకొచ్చాయి.నేతలే కాదు..ఏకంగా ఓ రాష్ట్ర హైకోర్టే ఆవును జాతీయ జంతువు చేయాలని కేంద్రానికి సూచించింది. ఇంతకీ పులి గెలుస్తుందా..ఆవు గెలుస్తాందా..?

పశు వధ నిషేధం చుట్టూ దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. కొందరు బ్యాన్ ను సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప‌శువ‌ధ‌పై కేంద్ర ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌ల‌కు వ్య‌తిరేకంగా దేశ‌మంత‌టా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇక కోర్టుల్లో పశువధపై కేసులు నడుస్తున్నాయి. ఆవును జాతీయ జంతువుగా ప్ర‌క‌టించాల‌ని రాజ‌స్థాన్ హైకోర్టు కేంద్ర ప్ర‌భుత్వానికి సూచ‌న చేసింది. ప‌శువ‌ధ‌కు పాల్ప‌డితే విధించే మూడేళ్ల జైలు శిక్ష‌ను జీవిత కాల శిక్ష‌గా మార్చాల‌ని కోర్టు త‌న తీర్పులో ఆదేశించింది.
జైపూర్ స‌మీపంలో ఉన్న ఓ గోశాల‌కు సంబంధించిన కేసులో జ‌డ్జి మ‌హేశ్ చంద్ర శర్మ ఈ సూచ‌న చేశారు. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్‌లో బీజేపీ ప్ర‌భుత్వం ఉంది. గోవ‌ధ‌కు పాల్ప‌డేవాళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం వ‌సుంద‌రా రాజే ఈమధ్యే వార్నింగ్ ఇచ్చారు. గోవుల‌ను అక్ర‌మంగా అమ్ముతున్న వారిపై ఆ రాష్ట్రంలో దాడులు కూడా జ‌రిగాయి.
tags Cow/Rajasthan Highcourt/National animal