బెడ్‌రూంలోకి పులి.. వరద పోయాక పోతా! - MicTv.in - Telugu News
mictv telugu

బెడ్‌రూంలోకి పులి.. వరద పోయాక పోతా!

July 18, 2019

Tiger's Bed N Breakfast In Assam Home As Raging Waters Flood Kaziranga........

ఏ అడవిలోనో, ఏ జూపార్కులోనో వుండాల్సిన పెద్దపులి ఇంట్లోకి చొరబడితే ఎలా వుంటుంది? గుండెజారి గల్లంతు అవుతుంది. ప్రాణభయంతో పరుగులు పెడతాం. అదే జరిగింది అస్సాంలో. అక్కడ భారీ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తుండటంతో జనజీవనమే అస్తవ్యస్తమైంది. హర్మతీ ప్రాంతంలోని కజిరంగా జాతీయ పార్కులో ఉండాల్సిన జంతువులు ఊళ్లమీద పడుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఏకంగా.. ఓ ఇంట్లోకి చొరబడింది. 

వరదలకు కజిరంగా జాతీయ పార్కులోకి భారీ స్థాయిలో నీరు చేరడంతో కొన్ని జంతువులు బయటకు వచ్చాశాయి. ఓ పులి మోతీలాల్‌ అనే ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి దర్జాగా పరుపుపై సేదతీరింది. మోతీలాల్ ఇంటికి వచ్చి ఆ గదిలోకి వెళదామని తలుపు తీశాడు. అంతే గుండె హండ్రెస్ స్పీడుతో కొట్టుకోసాగింది. ప్రాణభయంతో అరుస్తూ బయటకు పరుగులు పెట్టాడు. వెంటనే అతను అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆఘమేఘాల మీద అటవీ అధికారులు అక్కడికి వచ్చి ఆ పులిని తిరిగి పార్కులోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఎన్ని జంతువులు తమ ఇళ్లల్లోకి వస్తాయోనని స్థానికులు గుబులు చెందుతున్నారు.