ఢిల్లీలో హై అలర్ట్.. ఉగ్రముప్పు ఉందని హెచ్చరికలు - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో హై అలర్ట్.. ఉగ్రముప్పు ఉందని హెచ్చరికలు

October 30, 2019

దేశరాజధాని ఢిల్లీకి ఉగ్రముప్పు ఉందని ఐబీ అధికారులు హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్‌ విభజన ప్రక్రియను ఈనెల 31న కేంద్ర ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో దాడులు జరిగే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో 48 గంటలపాటు భద్రతా దళాలను కట్టుదిట్టం చేశారు.  సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిఘా పెంచారు. 

Jammu Kashmir.

జమ్మూ కశ్మీర్ విభజనను నిలువరించేందుకు ఉగ్రవాద సంస్థలు దాడులకు కుట్ర పన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. వెంటనే పోలీసులు ఉన్నత స్థాయి సమావేశం జరిపి భద్రతపెంచారు. అనుమానితులు కనిపించగానే వెంటనే ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఉగ్రవాదులు ప్రముఖులను తమ హిట్‌లిస్టులో చేర్చడంతో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు జమ్మూ కశ్మీర్‌లోనూ దాడులు జరిగే అవకాశం ఉండటంతో భద్రత పెంచారు.