దేశంలో ఉరి శిక్షఅమలు చేసేటోళ్లు లేరు.. తలారి కోసం తీహార్ జైలు ఎదురుచూస్తోంది. 19 మంది ఉరి శిక్ష కు సిద్ధంగా ఉన్నా ఆ ఉరి శిక్ష ను అమలు చేసే తలారి లేడు. దక్షిణ ఆసియాలోనే అతి పెద్దదైన తీహార్ జైలును మాత్రం తలారీ కొరత వేధిస్తుంది. తలారిగా పనిచేసేందుకు చాలా మంది రెడీ అవుతున్నారు జైలు అధికారులు వద్దు అంటున్నారట. ఎందుకంటే…
ఓ వ్యక్తికి ఉరి శిక్ష విధించాక.. అది అమలు చేయడానికి మేజిస్ట్రేట్ తర్వాత తలారి దే కీ రోల్. ఆ వ్యక్తి కి తాడు బిగించి, బ్లాక్ క్లాత్ ముఖానికి వేసి వేసి, ఉరి వేసి చనిపోయేదాకా అక్కడే ఉండి ఉరి అమలయ్యేలా చూసే పని తలారిది. ఇంత ప్రయారిటీ ఉన్న తలారి పోస్టు తీహార్ జైల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది.
1950 లో తీహార్ జైలును నిర్మించగా.. ఇప్పటి వరకు జైలు రికార్డుల్లో ఒక్క తలారి వివరాలు కూడా నమోదు కాలేదు. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఖైదీలు నలుగురికి కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇప్పుడు తీహార్ జైలు..ఉరి కంబం ఎక్కేందుకు రెడీగా ఉన్న 19 మందిలో నలుగురు ఢిల్లీ గ్యాంగ్ రేప్ నిందితులే. వీళ్లను ఉరి తీయడానికి కావలసిన తలారి మాత్రం తీహార్ జైలులో లేడు. 1989 లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య కేసులో ఉరి శిక్ష పడిన ఇద్దరు ఖైదీలు సత్వంత్ సింగ్, కెహర్ సింగ్ లను ఉరి తీయడానికి మీరట్ జైలు నుంచి రెండోందల రూపాయలు ఇచ్చి మరి తలారిని తీసుకొచ్చారు.ఇక 1989 నుంచి 2012 వరకు జైలులో ఒక్క ఉరి శిక్ష ను కూడా అమలు చేయలేదు.2013 ఫిబ్రవరి 9 న తీహార్ జైలులో అఫ్జల్ గురు ఉరి తీసిప తలారి ఎవరో ఇప్పటికి బయటకు రాలేదు.
మరోవైపు తలారిగా పని చేయడానికి అక్కడి స్థానికులు చాలా మంది కూడా రెడీ గానే ఉన్నారు. కానీ తలారి అవసరం అంతగా లేదు అన్నట్లుగా జైలు అధికారులు వ్యవహరిస్తున్నారు. మరి 19 మంది కి ఉరి శిక్ష అమలు చేయాలంటే మామూలు విషయమా..తప్పకుండా తలారీ కావాల్సిందే. తలారి దొరికేనా..వాళ్లు శిక్ష అమలయ్యేనా..ఇలాగే తీహార్ జైలు అధికారుల తీరు ఉంటే..