తీహార్ నుంచి 3000 మంది ఖైదీల విడుదల  - MicTv.in - Telugu News
mictv telugu

తీహార్ నుంచి 3000 మంది ఖైదీల విడుదల 

March 24, 2020

Tihar to release 3000 prisoners due to corona fear 

పెరోల్ ఇవ్వదగ్గ ఖైదీల జాబితాను సిద్ధం చేయాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించడంతో ఖైదీల విడుదల ప్రక్రియ ఊపందుకుంది. దేశంలో అతిపెద్ద జైలయిన తీహార్ సెంట్రల్ జైలు నుంచి 3 వేల మంది ఖైదీలు విడుదల కానున్నారు. కరోనా సోకకుండా ముందు జాగ్రత్తగా ఢిల్లీ ప్రభుత్వం వీరిని తాత్కాలికంగా విడుదల చేస్తోంది. తమను కరోనా తగ్గేంతవరకు ఇంటికి పంపాలని దేశవ్యాప్తంగా ఖైదీలు డిమాండ్ చేస్తున్నారు. కోల్‌కతాలోని డండం జైల్లో గొడవకు దిగి అక్కడి సామగ్రికి నిప్పు పెట్టారు. లాటిన్ అమెరికా దేశాల్లోని జైళ్లలో కరోనా ఘర్షణల కారణంగా పదుల సంఖ్యలో చనిపోతున్నారు. శ్రీలంక జైల్లో కూడా ఇద్దరు చనిపోయారు. 

కాగా, మన దేశంలో కరోనా కేసుల సంఖ్య  492కి చేరింది. ఈ రోజు ముంబైలో 65 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది. పదుల సంఖ్యో కోలుకుంటున్నారు. దేశంలో 606 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. ఢిల్లీ, పంజాబ్ లలో కర్ఫ్యూ అమలవుతోంది. దీంతో సీఏఏ నిరసనలే కూడా పూర్తిగా తగ్గిపోయాయి. అయితే నిత్యావసరాల ధరలు మాత్రం కొండెక్కి కూర్చుంటున్నాయి. ప్రభుత్వాలు సరైన ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు పాలు, కూరగాయల కోసం జేబులను గుల్ల చేసుకుంటున్నారు.