త్వరలో టిక్‌టాక్ నుంచి మరో యాప్! - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో టిక్‌టాక్ నుంచి మరో యాప్!

November 18, 2019

tik tak..

సోషల్ మీడియా సంచలనం టిక్ టాక్ నుంచి త్వరలో మరో మొబైల్ అప్లికేషన్ రాబోతుంది. టిక్‌టాక్ మాతృ సంస్థ అయిన బైట్‌డ్యాన్స్ టెక్నాలజీ త్వరలోనే ఓ నూతన మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ను లాంచ్ చేయనుంది. డిసెంబర్ నెలలో ఈ అప్లికేషన్ విడుదల కానుంది. 

ఈ అప్లికేషన్ పేరు వివరాలను బైట్‌డ్యాన్స్ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇక ఆ అప్లికేషన్‌ను నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కింద అందివ్వనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నెలకు 10 డాలర్ల కన్నా తక్కువగానే ఆ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుందని అంచనా. ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్ కోసం బైట్‌డ్యాన్స్ కంపెనీ ఇప్పటికే యూనివర్సల్ మ్యూజిక్, సోనీ మ్యూజిక్, వార్నర్ మ్యూజిక్ తదితర ప్రముఖ మ్యూజిక్ కంపెనీలతో ఒప్పందం చేసుకుందని సమాచారం.