వివాహబంధంతో ఒక్కటైన టిక్‌టాక్‌ జోడీ - MicTv.in - Telugu News
mictv telugu

వివాహబంధంతో ఒక్కటైన టిక్‌టాక్‌ జోడీ

November 10, 2019

టిక్‌టాక్ యాప్ తక్కువ కాలంలో యువతను ఎంతో ఆకట్టుకున్న మొబైల్ అప్లికేషన్. టిక్‌టాక్ కొందరి కాపురాల్లో చిచ్చు పెడితే మరికొందరిని వివాహబంధంతో ఒక్కటి చేస్తోంది. తాజాగా టిక్‌టాక్‌ ద్వారా పేరు తెచ్చుకున్న ఓ జంట పెళ్లి చేసుకుంది. టిక్‌టాక్‌ చేస్తూ పాపులర్‌ అయిన అల్లు రఘు, సుష్మితా శేషగిరి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

ఈ జంట చేసిన టిక్‌టాక్‌ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అలా వారు స్నేహితులుగా మారి తర్వాత ప్రేమించుకున్నారు. గురువారం బెంగళూరులో పెళ్లి చేసుకున్నారు. కన్నడ నటుడు ధ్రువ సర్జా వీరాభిమాని అయిన రఘు ఆయనను అనుకరించి చేసిన పలు టిక్‌టాక్‌ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. రఘు ఆహ్వానం మేరకు వీరి వివాహ కార్యక్రమానికి ధ్రువ సర్జా హాజరయ్యారు. ఈ సందర్భంగా నవ దంపతులను ఆశీర్వదించారు. టిక్‌టాక్‌లో దూసుకుపోతున్నారంటూ అభినందించారు. పెద్ద సంఖ్యలో ఉన్న రఘు, సుష్మితా ఫాలోవర్స్‌ శుభాకాంక్షలతో హోరెత్తించారు. ప్రస్తుతం రఘు బుల్లి తెరతో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.