అడ్డం తిరిగిన టిక్‌టాక్ ప్రేమ.. గజ్వేల్ నుంచి అనంతపురానికి వెళ్తే.. - MicTv.in - Telugu News
mictv telugu

అడ్డం తిరిగిన టిక్‌టాక్ ప్రేమ.. గజ్వేల్ నుంచి అనంతపురానికి వెళ్తే..

November 9, 2019

టిక్ టాక్ మోజు విపరీత పరిణామాలకు దారి తీస్తూనే ఉంది. దీని మాయలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్లు, వివాహ బందాలను తెంచుకుంటున్న వారూ చాలా మంది ఉన్నారు. తాజాగా టిక్‌టాక్ పరిచయంతో ఇద్దరు యువతులు మోసపోయారు. మరో ఇద్దరు యువకులతో ప్రేమలో పడి చివరికి వాళ్లు ప్లేటు ఫిరాయించడంతో చివరికి వారి కథ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. 

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం మక్తమాసాన్‌పల్లికి చెందిన ఇద్దరు యువతులు తరుచూ టిక్‌టాక్ వీడియోలు చేస్తూ ఉండే వారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా  బొమ్మనహాల్ మండలం దర్గాహోన్నూర్ గ్రామానికి చెందిన వంశీ, వన్నూరు స్వామి పరిచయం అయ్యారు. ఇది కాస్తా ప్రేమగా మారడంతో చాలా రోజులు ఫోన్లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. తర్వాత ఓ రోజు పెళ్లి చేసుకుందామని ఆ యువకులు వీరిని  పిలవడంతో ఇద్దరూ అనంతపురం ట్రైన్ ఎక్కి వెళ్లారు.

Tik Tok.

తీరా అక్కడికి వెళ్లాక వారి అసలు రంగు బయటపడింది. తాము పెళ్లి చేసుకోబోమంటూ మాట మార్చారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ యువతులు బొమ్మనహాళ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వంశీ, స్వామిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. వారిని కళ్యాణదుర్గంలోని ఉజ్వల్ హోమ్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. కాగా వంశీ, స్వామి తమను పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. తాజాగా జరిగిన ఘటన మరోసారి సంచలనంగా మారింది. సోషల్ మీడియా పిల్లలపై పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.