టిక్‌టాక్ పిచ్చి పీక్స్.. పిల్లాణ్ని ఫ్రిజ్‌లో పెట్టి.. - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్ పిచ్చి పీక్స్.. పిల్లాణ్ని ఫ్రిజ్‌లో పెట్టి..

April 17, 2019

పాత ఒక రోత.. కొత్త ఒక వింత అని అంటారు. కానీ కొత్తవి వింతే కాదు, పిచ్చివి కూడా. ప్రచారం కోసం జనం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. లైకులు, కామెంట్ల కోసం మానత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఇతరు ప్రాణాలను కూడా తీసుకుంటున్నారు. టిక్ టాక్ మొబైల్ యాప్ పిచ్చి ఏ స్థానంలో అద్దం పట్టే సంఘటన ఇది. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడో జరిగినట్లు తెలుస్తోంది.

కాస్త వెరైటీగా ఉంటుందని ఓ జంట టిక్ టాక్ కోసం తమ బుడ్డోణ్ని ఫ్రిజ్‌లో టిక్ టాక్ వీడియో తీసుకున్నారు. ‘బావగారూ బాగున్నారా.. ’ చిత్రంలో బ్రహ్మానందాన్ని ఫ్రిజ్‌లో పెట్టే సీన్ దీనికి ‘స్ఫూర్తి’ అట. ఎక్కువ సేపు బయట ఉంచే కంపుకొడుతుందనే రంభ, చిరంజీవిల డైలాగులు ఇందులో ఉన్నాయి. తర్వాత భర్త.. ఫ్రిజ్ డోర్ తీయడం, కూలింగ్ పొగల మధ్య చిన్నోడు ఉండడం వీడియోలో ఉంది. దీన్ని చూసిన జనం టిక్ టాక్ చేసిన వారిని బండబూతులు తిడుతున్నారు. పనికిమాలిన వీడియో కోసం చిన్నపిల్లాడి ప్రాణాలతో చెలగాటం ఆడతారా, ఆ చిన్నారి బదులు మీరో అందులో కూర్చుని చావొచ్చుగా అని చెండుతున్నారు.