టిక్‌టాక్ క్లోజ్.. నోటీసు ఓపెన్ చేయగానే బంద్  - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్ క్లోజ్.. నోటీసు ఓపెన్ చేయగానే బంద్ 

June 30, 2020

Tik tok mobile application closed

భారత ప్రభుత్వం విధించిన నిషేధం 24 గంటల గడవక ముందే అమల్లోకి వచ్చేసింది. కోట్లాది భారతీయుల సంతోషం ఆవిరైంది. టిక్ టాక్ మూగబోయింది. ఈ రోజు సాయంత్రం నుంచి యాప్ మూసుకుపోయింది. ఓపెన్ చేయగానే టిక్‌టాక్ వీడియోలు ప్లే అవుతాయి.  తర్వాత ఒక మెసేజ్ వస్తుంది. ‘భారత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. భారతీయ యూజర్ల గోప్యతకు అత్యంత ప్రధాన్యమిస్తుంది..’ అని అందులో ఉంటుంది. తర్వాత అక్కడే ఆగిపోయి ‘నో ఇంటర్నెట్ కనెక్షన్’ అనే మెసేజీ వస్తుంది. తర్వాత అంతా చీకటే. 

వీడియోలు సేవ్ చేసుకోకముందే.. 

టిక్‌టాక్ నిషేధంతో  యూజర్లు శోకసంద్రంలో మునిగిపోయారు. కొందరు చింగారీ యాప్ లోని కొత్త ఐడీలను పంచుకున్నారు. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో ఫాలో కావాలని కన్నీళ్లతో కోరుతున్నారు. తమ వీడియోలను సేవ్ చేసుకునే అవకాశం కల్పించి ఉంటే బావుండేదని, తీపిగుర్తులను కోల్పోయాని గోడు వెళ్లబోసుకుంటున్నారు.