హెచ్చరిక.. ఈ టిక్‌టాక్‌ చాలెంజ్ అస్సలు చేయొద్దు  - MicTv.in - Telugu News
mictv telugu

 హెచ్చరిక.. ఈ టిక్‌టాక్‌ చాలెంజ్ అస్సలు చేయొద్దు 

January 22, 2020

Tik Tok penny challenge 

ఫేస్‌బుక్, వాట్సాప్‌లను ఒక చూపు చూశాక వినోదం కోసం టిక్‌టాక్ చూడ్డం భోజనం చెయ్యాల్సినంత అవసరంగా మారిపోయింది! చైనా నుంచి చిలీ వరకు,  ఢిల్లీ నుంచి గల్లీ వరకు పాకిన టిక్కుటక్కు వీడియోల కోసం కుర్రోళ్లే కాకుండా ముసలీముతకా, కుక్కానక్కా పిల్లీపిచికా కూడా నానా పాట్లూ పడుతున్నారు/యి. నానా బీభత్సాలు సాగుతున్నాయి. నవ్వులు, డ్యాన్సులు, పాటలు, బకెట్లు.. పాతబడిపోవడంతో కొత్తకొత్త చాలెంజ్‌లను ట్రై చేస్తున్నారు. అలా వచ్చిందే ‘పెన్నీ చాలెంజ్’. 

ఇది చాలా ప్రమాదకరమని, ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి దీని గురించి చెప్పడం కూడా ప్రమాదకరమే కానీ, కొందరైనా దానివైపు వెళ్లకుండా ఉంటారని చెబుతున్నారు. ఈ చాలెంజ్ కింద టిక్‌టాక్ జనం.. మొదట మొబైల్‌ చార్జర్  అడాప్టర్‌ను ఎలక్ట్రిక్ సాకెట్లో పెడుతున్నారు. అయితే సాకెట్‌కు,  చార్జర్ అడాప్టర్‌కు మధ్య కొంత గ్యాప్‌ పెడుతున్నారు. ఆ ఖాళీ స్థలంలో ఒక నాణేన్ని(పెన్నీ)ని నెమ్మదిగా జారవిడుస్తున్నారు. దీంతో కరెంట్ ప్రవహించి మంటలు లేచి సాకెట్‌ కాలిపోతుంది. మరి ఇందులో చాలెంజ్ ఏముంది? ఏమీ లేదు, దుస్సాహసం మాత్రమే. నాణేన్ని భయపడకుండా ఆ ఖాళీలో జారవిడవడమే చాలెంజ్ అట. 

నిజానికి కరెంటుతో ఏ ఆటైనా ప్రమాదమే. నాణేనికి కరెంటు సోకే ప్రమాదం ఉంటుంది కనుక షార్ట్ సర్క్టూట్ వంటికి జరగొచ్చు. మంటల వల్ల కాలిపోవచ్చు. దీని కారణంగా కొన్ని దేశాల్లో ఇప్పటికే పలువురిపై పోలీసులు కేసులు కూడా పెట్టారని వార్తలు వస్తున్నాయి. తర్వాత మీ ఇష్టం.