నెల్లూరు టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

నెల్లూరు టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య

January 23, 2021

gf

టిక్‌టాక్ యాప్ మనకు అందుబాటులో లేకపోయినా అది సృష్టించిన అలజడి, మారణకాండ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన టిక్‌టాక్ స్టార్ రఫీ షేక్ ఆత్మహత్య చేసుకున్నాడు. క్రేజీ వీడియోలతో లక్షలమంది అభిమానులను సంపాదించుకున్న రఫీ కథ ఆకస్మికంగా ముగియడానికి టిక్‌టాక్ గొడవలే కారణమని తెలుస్తోంది.

 

 

రఫీని రెండు రోజుల కిందట గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాపర్లు అతణ్ని బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకుకు బట్టలు విప్పి కొడతామని, వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడతామని హెచ్చరించారు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో రఫీ ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రఫీ మరో టిక్‌టాక్ స్టార్ సోనికా కేతావత్ మృతి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2019లో అతడు సోనికాతో కలిసి హైదరాబాద్‌ వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది తీవ్రంగా గాయపడిన సోనిక ఆస్పత్రిలో చనిపోయింది. సోనికా, రఫీ ఇద్దరూ ప్రేమికులని, ఆమె మరణం వెనక మిస్టరీ ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో రఫీ మానసిక ఆందోళనకు గురై కొన్నాళ్లు టిక్‌టాక్‌‌కు దూరంగా ఉన్నాడు. తర్వాత అతనికి ఆరోగ్యం బాగాలేదంటూ స్నేహితులు ప్రచారం చేశారు. చికిత్స కోసం రఫీ అభిమానుల నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు. ఈ నేపథ్యంలో రఫీ ఆత్మహత్యకు పాల్పడ్డం కలకలం రేపుతోంది.