మనవడు తప్పు చేసుంటే శిక్షించండి.. హోం మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

మనవడు తప్పు చేసుంటే శిక్షించండి.. హోం మంత్రి

July 19, 2019

తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీ మనవడు ఫర్కాన్ తన స్నేహితుడితో కలిసి పోలీస్ ఉన్నతాధికారుల వాహనంపై టిక్ టాక్ వీడియో దుమారం రేపుతోంది. ఈ వీడియో వైరల్ కావడం, విమర్శలు వెల్లువెత్తడంతో హోం మంత్రి స్పందించారు. పోలీస్ వాహనంపై టిక్ టాక్ వీడియో చేసిన తన మనవణ్ని ఆయన మందలించారు. 

తన మనవడు తప్పు చేసి ఉంటే అతడిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. ఫర్కార్ అహ్మద్ తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు చెందిన వాహనంపై కూర్చొని ఉండగా.. అతడి స్నేహితుడు టిక్‌టాక్ వీడియో చేసాడు. ‘నా స్నేహితుడిని గౌరవించకపోతే.. పీక కోస్తా’ అనే డైలాగ్‌తో ఫర్కాన్ స్నేహితుడు టిక్‌టాక్ వీడియో చేశాడు. అది సినిమా డైలాగ్ అయినప్పటికీ.. పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఉండటంతో నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి.