టిక్‌టాక్‌ చేస్తుండగా బయటపడ్డ శవం - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌ చేస్తుండగా బయటపడ్డ శవం

June 30, 2020

tik tok users Post Video Of Moment They Find Human Remains Inside Suitcase

సరదాగా టిక్‌టాక్ వీడియో‌ చేసేందుకు తన స్నేహితులతో కలిసి బీచ్ కి వెళ్లిన ఓ అమ్మాయికి అనుకోని షాక్ తగిలింది. టిక్‌టాక్ వీడియో తీస్తుండగా వారికి బీచ్ లోని రాళ్లపై ఓ సూట్ కేసు కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో చనిపోయిన వ్యక్తి శరీర భాగాలు ఉన్నాయి. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్‌లో చోటుచేసుకుంది. 

ఉగ్హెన్రీ అనే యువతి తన స్నేహితులతో కలిసి సీటెల్ సమీపంలోని బీచ్‌లో టిక్‌టాక్ వీడియోలు చేసేందుకు వెళ్లింది. బీచ్ లో టిక్ టాక్ వీడియో చేస్తుండగా.. అక్కడ ఒక సూట్‌కేసు కనిపించింది. దీంతో వాళ్లు ఆత్రుతతో అక్కడున్న ఓ కర్ర సహాయంతో దానిని ఓపెన్ చేశారు. అలా సూట్ కేసు ఓపెన్ చేస్తూ వీడియో తీశారు. అందులో ఓ నల్ల కవర్ కనిపించింది. ఆ సూట్‌కేసు నుంచి తీవ్ర దుర్వాసన కూడా వచ్చింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు అక్కడికి చేరుకుని సూట్‌కేసును స్వాధీనం చేసుకున్నారు. అందులో గుర్తుతెలియని వ్యక్తి శరీర భాగాలు ఉన్నాయని తెలిపారు. ఆ పరిసరాల్లో గాలించగా.. మరో సూట్ కేసు లభించిందని, అందులో కూడా మనిషి శరీర భాగాలే ఉన్నాయన్నారు. ఈ వీడియోను టిక్‌టాక్‌లో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్ అవుతోంది. ఆ సూటుకేసులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.