సీఎం జగన్‌పై టిక్‌టాక్ వీడియో..వ్యక్తిపై కేసు - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం జగన్‌పై టిక్‌టాక్ వీడియో..వ్యక్తిపై కేసు

February 27, 2020

bcgbvgcb

గత కొద్దిరోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలపై అసభ్యకరమైన కామెంట్స్, పోస్ట్ పెడుతూ నెటిజనులు రెచ్చిపోతున్నారు. దీంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎంపై అసభ్యకర వీడియోలు చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం జగన్‌పై టిక్ టాక్ యాప్‌లో అసభ్యకర పోస్టులు చేస్తున్న వ్యక్తిపై కడప జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. 

జిల్లాలోని మైదుకూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి ఇటీవల సీఎం జగన్‌ను దుర్భాషలాడుతూ టిక్‌టాక్‌లో కొన్ని వీడియోలు తీసి పోస్ట్ చేశాడు. ఆ వీడియోలను చూసిన దువ్వూరు మండలం పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నాయకుడు కానాల జయచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్లయ్యపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ దువ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ కుళ్లాయప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత వారం డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణిపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో కామెంట్ చేసిన యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.