కొంప ముంచిన టిక్‌టాక్‌.. ఆమెతో ఆమె జంప్ - MicTv.in - Telugu News
mictv telugu

కొంప ముంచిన టిక్‌టాక్‌.. ఆమెతో ఆమె జంప్

September 25, 2019

స్మార్ట్‌ఫోన్ ఎంత ప్రమాదకరమైందో చెప్పే ఘటన ఇది. అతిగా దాంట్లోనే కాలం గడపడం వల్ల జీవితాలే తలకిందులు అవుతాయని చెబుతోంది ఈ ఉదంతం. భర్తలు దూరంగా విదేశాల్లో వుండటం.. ఇక్కడ భార్యలు సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవడంతో పర్యవసానాలు చాలా దారుణంగా వుంటున్నాయి. తాజాగా ఓ వివాహిత టిక్‌టాక్ ఫ్రెండ్‌తో పరిచయాన్ని పెంచుకుని ఆమెతోనే ఉడాయించింది. తనకు పెళ్లి అయిందన్న విషయాన్ని కూడా మరిచిపోయింది. భర్తను వదిలేసి స్నేహితురాలితో ఉఢాయించింది. ఈ ఘటన తమిళనాడు శివగంగై జిల్లా సానా ఊరణిలో చోటు చేసుకుంది. ఊరణికి చెందిన లియోకు ఈ ఏడాది జనవరిలో వినీత అనే యువతితో వివాహమైంది. లియో ఉద్యోగం నిమిత్తం పెళ్లైన 45 రోజులకే సింగపూర్ వెళ్లిపోయాడు.

Tiktak.

భర్త దూరంగా వుండటంతో వినీత టిక్‌టాక్‌కు అలవాటు పడింది. అదికాస్తా ఆమెకు వ్యసనంగా మారిపోయింది. లేస్తే, కూర్చుంటే ఇలా అస్తమానూ ఫోనే ప్రపంచం అయిపోయింది ఆమెకు. ఆమెను తల్లి దండ్రులు, అత్తమామలు మందలించినా వినీత తన ధోరణి మార్చుకోలేదు. ఈక్రమంలో టిక్‌టాక్‌లో వినీతకు, అభి అనే యువతితో పరిచయం ఏర్పడింది.  వీరిద్దరి పరిచయం కాస్తా స్వలింగ సంపర్కానికి దారితీసింది. పెద్దలకు తెలియకుండా చాటు మాటుగా రాసలీలలు సాగించేవారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకునేవారు. అభి ఫోటోను వినీత తన భుజంపై టాటూ కూడా వేయించుకునేదాకా వారి చనువు పెరిగిపోయింది. ఇద్దరూ చనువుగా ఉన్న వీడియోలు తీసి పోస్ట్ చేసేవారు. అయితే వీరి వీడియోలు చూసిన భర్త లియో ఆమెను మందలించాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. 

భార్య తన మాట వినడంలేదని లియో సింగపూర్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంతలో బీరువాలో వున్న 20 తులాల బంగారం మాయమైంది. ఏమైంది అని అడిగితే తెలియదు అని మాట దాటవేసింది. దీంతో లియో భార్యను తీసుకుని పుట్టింటి వద్ద వదిలేసి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన వినీత పుట్టింట్లోనుంచి ప్రియురాలు అభితో పారిపోయింది. దీంతో వినీత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.