టిక్‌టాక్‌ లేకపోతేనేం.. ఇవి ఉన్నాయిగా.. - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌ లేకపోతేనేం.. ఇవి ఉన్నాయిగా..

July 4, 2020

MOBILE APPS

నవ్వుల పువ్వులు పూయించిన టిక్‌టాక్ మూగబోయింది. అదే ప్రాణంగా బతికిన కోట్లాదిమంది కళాకార్స్‌కు నిద్ర పట్టడం లేదు. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. తమలో దాగిన టాలెంటును నిరూపించుకోడానికి తిప్పులు పడుతున్నారు. టిక్‌టాక్‌ను పోలిన ఎన్నో షార్ట్ వీడియో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే చైనాతో గొడవ కారణంగా మన దేశానికి చెందిన యాప్స్ అయితేనే బావుంటుందని యూజర్లు కోరుకుంటున్నారు. మరి టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయాలు ఏంటో ఓ లక్కేద్దాం పదండి..  

చింగారీ 

టిక్‌టాక్‌పై నిషేధం విధించాక ఎక్కువ మంది చింగారిని ఫోన్లలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కోటికి పైగా డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. అయితే తెలుగు లోకల్, మాస్ మసాలా ఫ్లేవర్ లేకపోవడం నిరాశపరుస్తోంది. ఇందులో వార్తలు, గేమ్స్ కూడా అదనపు ఆకర్షణ. తెలుగుతో పాటు చాలా భాషలను సపోర్ట్ చేస్తోంది. ప్రస్తుతానికి ఎక్కువగా హిందీ యూజర్లే కనిపిస్తున్నారు. తెలుగు నెటిజన్లు ఇప్పుడిప్పుడే సందడి చేస్తున్నారు. 

 

మోజ్ 

టిక్‌టాక్‌లో ఫీచర్లన్నీ ఇందులో ఉన్నాయి. 15 భాషలు అందుబాటులో ఉన్నాయి. 15 సెకన్ల వీడియోలను పెట్టుకోవచ్చు. షేర్‌చాట్ దీన్ని ప్రారంభించింది. స్పెషల్ ఎఫెక్ట్స్, స్టిక్కర్లు వంటి అన్ని హంగులూ ఉన్నాయి. 

 

రోపోసో

ఇది భారతీయ యాప్. ఆరు కోట్ల మంది యూజర్లు ఉన్న ఈ యాప్‌లో కేవలం మ్యూజిక్ వీడియోలే కాకుండా ఫుడ్, ఫ్యాషన్, కవిత్వం, ట్రావెల్ వంటి అనేక అంశాల్లో వినోదం పొందొచ్చు. టిక్‌టాక్‌ను నిషేధించాక లక్షలమంది దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. దీంతో మొదట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. 

 

ట్రిల్లర్

ఇందులోనూ అన్ని హంగులూ ఉంటాయి. అమెరికాకు చెందిన ట్రిల్టర్ ఎల్ఎల్పీ కంపెన్నీ దీన్ని అభివృద్ధి చేసింది. వందకు పైగా ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్టర్లు ఉన్నాయి. ఇతర సోషల్  మీడియాల్లోకి కూడా వీడియోలను పంపుకోవచ్చు. 

వీటితోపాటు చీజ్, విగో వీడియో, లైక్, క్వాయ్, ఫైర్ వర్క్, ఫనిమేట్, డబ్ స్మాష్, డూబ్, స్మూల్, ఇన్షాట్, మిత్రో, వీమేట్ వంటివెన్నో టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకుంటున్నారు. అయితే వీటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని, డేటా చోరీ అవకాశాలు ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.