ఫేస్‌బుక్‌ను వెనక్కినెట్టిన టిక్ టాక్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్‌ను వెనక్కినెట్టిన టిక్ టాక్

January 16, 2020

fb01

చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా మొబైల్ అప్లికేషన్ టిక్ టాక్ ఎంత వేగంగా ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలబ్రిటీల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు టిక్ టాక్ యాప్‌ను వినియోగిస్తున్నారు. తాజాగా టిక్ టాక్ మరో ఘనత సాధించింది. సోషల్ మీడియా కింగ్‌గా ఉన్న ఫేస్‌బుక్, మెసెంజర్‌లను వెనక్కినెట్టింది. 

సెన్సర్ టవర్ అనే సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ యాప్ 700 మిలియన్ల డౌన్ లోడ్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఫేస్‌బుక్, మెసెంజర్ మూడు, నాలుగు స్థానాలకు పడిపోయాయి. కాగా, ఈ జాబితాలో ఫేస్‌బుక్ సంస్థకు చెందిన వాట్సాప్ యాప్ అగ్రస్థానంలో ఉంది. వాట్సాప్ 850 మిలియన్ డౌన్ లోడ్లతో నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. అలాగే ఫేస్‌బుక్ సంస్థకు చెందిన మరో యాప్ ఇంస్టాగ్రామ్ 500మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో ఐదవ స్థానంలో ఉంది.