టిక్‌టాక్ తల్లికి రూ. 45 వేల కోట్ల నష్టం  - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్ తల్లికి రూ. 45 వేల కోట్ల నష్టం 

July 2, 2020

TikTok ban in India ByteDance could lose ₹45k crore

భారత ప్రభుత్వం 59 చైనా మొబైల్ యాప్స్‌పై విధించిన నిషేధం పరిణామాలు తీవ్రంగానే ఉండనున్నాయి. వీటిలో భారతీయులు ఎక్కువగా వాడిన టిక్‌టాక్ యాప్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు చుక్కలు కనిపించనున్నాయి. ఆ కంపెనీకి ఏకంగా 6 బిలియన్ డాలర్ల (రూ. 45 వేల కోట్ల) నష్టం వాటిల్లనుందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ అంచనా వేసింది. ఈ పత్రిక చైనా ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంటుంది. 

 

భారత ప్రభుత్వం అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, పెట్టుబడులకు రక్షణ కల్పించాలని టిక్ టాక్ సంస్థ, చైనా ప్రభుత్వాలు కోరాయి. చైనాతో ఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం తమ పౌరుల డేటాను చోరీ చేస్తున్నారంటూ చైనా యాప్స్‌ను నిషేధించింది. ముఖ్యంగా కోట్ల మంది వాడే టిక్‌టాక్ మూగబోవడంతో బైట్ డ్యాన్స్‌కు వాణిజ్య ప్రకటనలు, ఇతర డిజిటల్ ఆదాయాలు భారీగా పడిపోనున్నాయి. దీనిపై భారత సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి ఆ కంపెనీ కసరత్తు చేస్తోంది.అయితే దాని తరఫున వాదించబోమని ప్రముఖ లాయర్లు ఇప్పటికే స్పష్టం చేశారు.