టిక్‌టాక్‌లో మరో చాలెంజ్.. ఆడోళ్లు మాత్రమే చేయగలరట! - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌లో మరో చాలెంజ్.. ఆడోళ్లు మాత్రమే చేయగలరట!

December 3, 2019

TikTok.

రైస్ బకెట్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ ఇలా కొన్ని ఏదో ఒక రకంగా సమాజానికి మేలు చేసేవిగా ఉన్నాయి. టిక్ టాక్ వచ్చిన తర్వాత కొన్ని వేలం వెర్రి  ఛాలెంజ్‌లు కూడా పెరిగిపోయాయి. తాజాగా సోషల్ మీడియాలో అలాంటి మరో టిక్ టాక్ ఛాలెంజ్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనికి చైర్ ఛాలెంజ్ అంటూ పేరు పెట్టి తెగ షేర్లు చేస్తున్నారు. 

ఈ ఛాలెంజ్ ఏంటంటే.. ఓచైర్ గోడ దగ్గర పెట్టి గోడకు ఫీటు దూరంలోనుంచి మనిషి తన తలను గోడకు అనించాలి. తర్వాత మెల్లగా చైర్‌ను తన చేతిలతో పట్టుకోవాలి. ఆ వెంటనే చైర్ పైకిలేపుతూ… గోడకు దూరంగా జరుగుతూ నిల్చోవాలి. దీన్ని ట్విట్టర్‌ఖాతాలో పోస్టు చేసి తెగ వైరల్ చేశారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. దీన్ని కేవలం అమ్మాయిలు మాత్రమే చేస్తారని, మగవారికి సాధ్యం కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా విడుదలైన వీడియోలో కూడా ఇద్దరు మగవాళ్లు చేయలేకపోయారు. కానీ ఓ అమ్మాయి మాత్రం సులభంగా ఈ పని చేయడం విశేషం.