టిక్‌టాక్ డేటా సింగపూర్‌లో.. త్వరలో భారత్‌లోనూ డేటా సెంటర్లు - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్ డేటా సింగపూర్‌లో.. త్వరలో భారత్‌లోనూ డేటా సెంటర్లు

July 4, 2020

CEO Kevin Mayer.

గాల్వాన్ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన భారత్.. జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత దృష్ట్యా చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ఇతర యాప్‌ల పరిస్థితి ఎలా ఉన్న టిక్‌టాక్‌కు మాత్రం భారీ నష్టం వాటిల్లింది.  ఈ క్రమంలో బ్యాన్ చేసిన ఆయా యాప్‌ల సంస్థలకు వివరణ ఇచ్చేందుకు గడువు కూడా ఇచ్చింది. తాజాగా టిక్‌టాక్ ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్టు సమాచారం. జూన్ 28న టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మాయర్ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించారట. లేఖలో ఆయన ఏమన్నారంటే.. చైనా ప్రభుత్వం తమ నుంచి టిక్‌టాక్ వినియోగదారుల సమాచారం కోరలేదనియ తెలిపింది. 

ఒకవేళ చైనా ప్రభుత్వం ఇలా అడిగినా కూడా తాము సమాచారాన్ని ఇచ్చే ప్రసక్తే ఉండదని చెప్పింది. అలాంటి పరిస్థితే గనక వస్తే.. చైనా‌కు దూరం జరిగే ప్రయత్నం చేశారట. టిక్‌టాక్ డాటా మొత్తం ప్రస్తుతం సింగపూర్‌లోని సర్వర్‌లలో ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత్‌లోనూ డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని కూడా ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా,  ప్రభుత్వం ఈ బ్యాన్‌ను ఇప్పట్లో ఉపసంహరించుకునే అవకాశమే లేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతతో ముడిపడిన అంశం కావడంతో.. ఈ విషయమై టిక్‌టాక్‌కు చట్టపరమైన ఊరట లభించడం కూడా అంత తేలికైన పనికాదని నిపుణులు అంటున్నారు.