టిక్‌టాక్‌‌లో మనమే టాప్‌ - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌‌లో మనమే టాప్‌

November 17, 2019

TikTok  .

సోషల్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ ప్రస్తుతం యువతను ఎంతగానో ఆకట్టుకుంటోన్న సంగతి తెల్సిందే. కొందరు ప్రమాదకర ప్రాంతాల్లో టిక్‌టాక్ వీడియోలు చేసి ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా విడుదలైన ఓ నివేదిక టిక్‌టాక్‌లో మన దేశమే అగ్రస్థానంలో ఉందని చెబుతోంది. టిక్‌టాక్ ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ ప్లేస్టోర్ సహా ఆపిల్ యాప్‌ స్టోర్‌ నుంచి 150 కోట్ల డౌన్‌లోడ్లను చేరుకోగా 46.8 కోట్ల యూనిక్‌ ఇన్‌స్టాల్స్‌తో భారత్‌ నెంబర్‌ వన్‌గా నిలిచింది. 

టిక్‌టాక్‌ డౌన్‌లోడ్స్‌లో 31 శాతం ఇండియా నుంచే ఉండడం విశేషం. 2019లో టిక్‌టాక్‌ గత ఏడాది కంటే ఆరు శాతం అధికంగా 61.4 కోట్ల డౌన్‌లోడ్స్‌ సాధించిందని మొబైల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ వెల్లడించింది. 2019లో ఇండియా నెటిజన్లు ఇప్పటివరకూ 27.6 కోట్ల వరకూ టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, గ్లోబల్‌ ఇన్‌స్టాల్స్‌లో ఇది 45 శాతం వరకూ ఉంటుందని ఆ నివేదిక తెలిపింది. ఇక చైనా 4.5 కోట్ల డౌన్‌లోడ్స్‌తో రెండవ అత్యధిక డౌన్‌లోడర్‌గా, 3.6 కోట్ల డౌన్‌లోడ్స్‌తో అమెరికా టాప్‌ 3లో నిలిచాయి.