టిక్‌టాక్‌ స్టార్ పైత్యం.. తిక్క కుదిర్చిన మహిళా కమిషన్  - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌ స్టార్ పైత్యం.. తిక్క కుదిర్చిన మహిళా కమిషన్ 

May 18, 2020

TikTok influencer Faizal Siddiqui get notice form National Commission for Wome.jp

షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్‌లో సరదా పేరుతో ఏం చేసినా చెల్లుతుందనే వారికి హెచ్చరిక. యాసిడ్ దాడి చేస్తున్నట్లు వెర్రి వీడియో తీసిన టిక్ టాక్ స్టార్ చిక్కుల్లో పడ్డాడు. అతని వీడియోపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియోతోపాటు అతని అకౌంటును తొలగించాలని టిక్ టాక్ సంస్థను ఆదేశించింది.

 

 

ఫైజల్ సిద్దిఖీ అనే టిక్ టాక్ స్టార్‌కు 1.30 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. అంత మంది చూస్తున్నారు కదా అని అతడు తెగ రెచ్చిపోయాడు. యాసిడ్ దాడిని అనుకరిస్తూ ఓ యువతిపై నీళ్లు చల్లాడు. వేరే వ్యక్తిని ఇష్టపడుతున్నందుకు ప్రతీకారంగా ఆ దాడి చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తర్వాత  అమ్మాయి ముఖానికి రంగులు పసుకుని యాసిడ్ దాడి బాధితురాలిగా నటించింది. ఈ వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో మహిళా కమిషన్ అతనికి తాఖీదులు జారీ చేసింది. మహిళలపై నేరాలను రెచ్చగొట్టేలా ఉన్న వీడియోను, అతని ఖాతాను తీసేయాలని కోరింది.