రిలయన్స్ చేతికి టిక్‌టాక్ ఇండియా! - MicTv.in - Telugu News
mictv telugu

రిలయన్స్ చేతికి టిక్‌టాక్ ఇండియా!

August 13, 2020

TikTok Parent ByteDance in Early Talks With Reliance Industries

చైనాకు షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను భావితవ్యంగా రోజుకో విధంగా మారుతోంది. భారత ప్రభుత్వం ఈ యాప్ ను నిషేధించిన సంగతి తెల్సిందే. దీంతో అమెరికా, ఆస్ట్రేలియా మొదలగు దేశాలు కూడా ఈ యాప్ ను బ్యాన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. టిక్ టాక్ ను అమెరికాకు చెందిన కంపెనీకి 45 రోజుల్లోగా అమ్మేయాలని లేకపోతే బ్యాన్ చేస్తానంటూ అల్టిమేటం జారీ చేశాడు. 

దీంతో అమెజాన్, మైక్రో సాఫ్ట్, ట్విట్టర్ మొదలగు కంపెనీలు టిక్ టాక్ ను కొనడానికి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ ఇండియాకు చెందిన రిలయన్స్ సంస్థతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.  ఇండియాలో తమ మొత్తం వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు విక్రయించేందుకు బైట్ డ్యాన్స్ కూడా ఆసక్తి కనబరుస్తునట్టు తెలుస్తోంది. ఈ మేరకు టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ స్వయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో నెల చర్చలు జరిపారని వాణిజ్య పత్రికలలో కథనాలు వెలుబడుతున్నాయి. అయితే, ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇక టిక్ టాక్ భారత విభాగాన్ని సొంతం చేసుకోనుందన్న వార్తలపై స్పందించేందుకు రిలయన్స్ సంస్థ నిరాకరించింది.