టిక్‌టాక్‌ చావు చింగారీకి పెళ్లి..గంటకు లక్ష డౌన్‌లోడ్స్ - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌ చావు చింగారీకి పెళ్లి..గంటకు లక్ష డౌన్‌లోడ్స్

June 30, 2020

TikTok rival Chingari clocks 100,000 downloads per hour

భారత ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ మొబైల్ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయమైన చింగారీ యాప్‌ అనూహ్యంగా వైరల్ అవుతోంది. టిక్‌టాక్ యాప్ నిషేధించిన తరువత చింగారీ యాప్‌ గంటకు దాదాపు లక్ష డౌన్‌లోడ్‌లు అవుతున్నాయి. ఈ విషయాన్ని చింగారి యాప్ సంస్థ వెల్లడించింది. అలాగే గంటకు దాదాపు 20లక్షల మంది ఈ యాప్‌ను చూస్తున్నట్లు తెలిపింది. చింగారీ యాప్‌ ఇప్పటికే ఆపిల్ ఆప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లలో మూడు మిలియన్ల సార్లు డౌన్‌లోడ్ అయినట్లు తెలుస్తోంది.

ఈ యాప్ ను బెంగళూరుకు చెందిన బిస్వాత్మా, సిద్ధార్ధ్‌లు రూపొందించారు. చింగారీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యాప్ ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు భాషలతోపాటు మరో ఏడు భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. తాజాగా సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఈ యాప్ లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఇన్ని రోజులు చైనీయ టిక్‌టాక్ యాప్‌ను వినియోగించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా దేశీయ చింగారీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో వెల్లడించారు.