బ్రేకింగ్.. టిక్‌టాక్ సహా 59 యాప్స్‌ పై నిషేధం - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్.. టిక్‌టాక్ సహా 59 యాప్స్‌ పై నిషేధం

June 29, 2020

59 China Apps

భారత్-చైనా సరిహద్దు వివాదంతో భారత్ చైనా మీద గుర్రుగా ఉంది. ఉలికులికిపడుతున్న చైనా వస్తువులను మనం ఎందుకు వాడాలనే క్రమంలో సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ చైనా’ నినాదం ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. చైనా వస్తువులను, యాప్స్‌లను నిషేధించాలని ముక్తకంఠంతో అంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 59 చైనా మొబైల్ యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్ సహా 59 యాప్స్ పై నిషేధం విధించింది. లైకీ, క్లబ్ ఫ్యాక్టరీ, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హెలో, వైబో, డియూ క్లీనర్, డియూ బ్రౌజర్, యూ వీడియో తదితర 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది.

కాగా, జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా సైనికులు బలగాల ఉపసంహరణ సమయంలో కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది భారత జవాన్లను హతమార్చారు. 17 మంది చైనా సైనికుల మృతదేహాలను భారత్ అప్పగించింది. అంతేకాదు తాము బంధీగా పట్టుకున్న చైనా కల్నల్‌ను కూడా భారత్ విడుదల చేసింది. అయితే చైనా మాత్రం తమ సైనికుల మరణాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.