ఏ చిన్న సందర్భం దొరికినా టిక్ టాక్ చేస్తూ టైం పాస్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. చాలా మంది దీనికి బానిసగా మారిపోయి సందు దొరికితే చాలు వీడియోలు చేసి అప్ లోడ్ చేస్తున్నారు. వ్యూస్,లైక్స్, ఫాలోవర్స్ అంటూ ఎంతకైనా తెగించేస్తున్నారు. ఇది ఎంత వరకు వెళ్లిందంటే.. చివరికి క్వారంటైన్ సెంటర్లను కూడా వదలిపెట్టకుండా చేసింది. కరోనా అనుమానంతో క్వారంటైన్లో ఉన్న కొంత మంది వ్యక్తులు చేసిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఒడిశాలోని బద్రక్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ଭିଡିଓ କରି କାନ୍ଦି କାନ୍ଦି କହୁଥିଲେ ଆମକୁ ରକ୍ଷା କର ବୋଲି ଲଜ୍ୟା ନାହିଁ ତୁମମାନଙ୍କୁ #ଭଦ୍ରକଜିଲ୍ଲା #ତିହିଡି #ବ୍ଲକର quarantine centre ରେ Tiktok ସୁଟିଂ କରି,ନିଜର ହୀନ ମାନସିକତାର ପରିଚୟ ଦେଉଛନ୍ତି,ପ୍ରଶାସନ ଏମାନଙ୍କ ପାଇଁ ତତ୍ପର ଥିଲା ବେଳେ ଏମାନେପୁରା କୋଣାର୍କ ଗଣନାଟ୍ୟପେଣ୍ଡାଲ ଭାବୁଛନ୍ତି?ପାଲା,ଦାସ କାଠିଆ ସବୁ କିଛି, pic.twitter.com/PlAj1MdqiU
— Papun Satapathy?? (@SamajPremiPapun) May 4, 2020
ఇటీవల కొంత మందిని అధికారులు కరోనా అనుమానంతో తిహిడి బాటాపర పంచాయతీ హైస్కూల్లో క్వారంటైన్ చేశారు. అందులో ఉన్నవారు ఏం చేయాలో తోచక క్వారంటైన్ సెంటర్లో టిక్‌టాక్ వీడియోలు చేశారు. వారుచేసిన పిచ్చిపనితో చిర్రెత్తుకొచ్చిన బాటాపర పంచాయితీ సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏడుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని. ఓ వైపు ప్రజలంతా కరోనాతో వణికిపోతుంటే క్వారంటైన్ సెంటర్లో ఉండి కూడా ఇలాంటి పిచ్చి చేష్టలు ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.సామాజిక దూరం పాటించాలనే కనీస శ్రద్ధ లేకుండా పిచ్చి గంతులు వేయడం ఏంటని మండిపడుతున్నారు.