Tillu 2 movie title released by the makers
mictv telugu

ఖాళీగున్న హీరోయిన్లు మనకొద్దు.. డీజే టిల్లు 2 ఫన్నీ అఫీషియల్ వీడియో

October 24, 2022

డీజే టిల్లు అంటూ తన మార్కు కామెడీ అండ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించిన సిద్దు జొన్నలగడ్డ ఆ సినిమాతో తన కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వివరాలను అధికారికంగా వీడియో రూపంలో విడుదల చేశారు. దీపావళిని పునస్కరించుకొని విడుదల చేసిన ఈ వీడియోలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు మల్లిక్ రామ్ అని కన్ఫామ్ చేశారు. ఈ స్పెషల్ వీడియోలో టిల్లు ఫుల్లుగా మద్యం తాగి ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతాడు. ఈ సందర్భంగా మత్తులో కానిస్టేబుల్‌తో పెట్టుకున్న వాదన నవ్వులు తెప్పిస్తోంది. తాను హీరోనని, తన పక్కన పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోందని టిల్లు బిల్డప్ ఇస్తాడు. ఇంతలో పక్కనున్న వ్యక్తి.. పూజా హెగ్డే చాలా బిజీగా ఉన్నానని చెప్పిందని చెప్పగా, అయితే ఖాళీగున్న హీరోయిన్లు మనకొద్దని టిల్లు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తాడు. టిల్లు స్క్కేర్‌ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఈ వీడియోలో వెల్లడించారు. కాగా, ఇందులో సిద్దుకి ‘స్టార్ బాయ్’ అనే టైటిల్ పెట్టడం గమనార్హం.