ఎగ్జిట్ పోల్స్ అన్నీ తూచ్.. మళ్ళీ గెలిచేది నేనే - MicTv.in - Telugu News
mictv telugu

ఎగ్జిట్ పోల్స్ అన్నీ తూచ్.. మళ్ళీ గెలిచేది నేనే

May 20, 2019

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. ఆదివారం చివరి విడత పోలింగ్ సమయం ముగియగానే వివిధ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. కేంద్రంలో ఎన్డీయేనే మళ్ళీ అధికారంలోకి రానుందని, ఏపీలో వైసీపీ గెలువబోతుందని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ప్రజల నాడిని పట్టుకోవడంలో వివిధ సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి అన్నారు. గతంలో చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ లెక్కలు వాస్తవానికి దూరంగా వచ్చాయన్నారు. నిస్సందేహంగా ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీయేతర కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యం అన్నారు. ఇదే సందర్భంలో 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని ఈసీని కోరుతున్నామన్నారు.