మందుబాబులకు అలర్ట్.. బార్లు, పబ్బుల టైం టేబుల్ మార్పు - MicTv.in - Telugu News
mictv telugu

మందుబాబులకు అలర్ట్.. బార్లు, పబ్బుల టైం టేబుల్ మార్పు

May 14, 2022

హైదరాబాదులో బార్లు, పబ్బుల సమయాన్ని పోలీస్ శాఖ మార్చింది. ఇక నుంచి రాత్రి 11 గంటల కల్లా పబ్బులు, బార్లను మూసివేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు రాత్రి 12 గంటల వరకు తెరచి ఉంచే అవకాశం ఉండగా, తాజాగా గంట సమయాన్ని కుదించారు. ఇటీవల ఓ పబ్‌లో కొకైన్ డ్రగ్ పట్టుబడడంతో పోలీస్ శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. ఇంతేకాక, బార్ల యజమానులకు కొత్త రూల్స్ పెట్టింది. సీసీ టీవీ ఫుటేజ్ బ్యాకప్ నెలరోజుల వరకు ఉంచాలని ఆదేశించింది. పాటల ధ్వని పరిమితికి మించి ఉండరాదని పేర్కొంది. అయితే ఈ నిబంధన కేవలం స్థానిక ప్రజలు ఉపయోగించే పబ్బులు, బార్లకు మాత్రమే వర్తిస్తాయనీ, విదేశీ ప్రతినిధులు బస చేసే స్టార్ హోటళ్లకు వర్తించవని స్పష్టం చేశారు. నగరంలోని మెట్రోపాలిటన్ కల్చర్‌ను దృష్టిలో పెట్టుకొని అక్కడ 24 గంటల పాటు మద్యం అమ్మకాలు కొనసాగుతాయని వివరించారు.