ఆధార్ గడువు మళ్లీ పెంపు - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్ గడువు మళ్లీ పెంపు

October 25, 2017

సంక్షేమ పథకాలను ఆధార్ తప్పనిసరికాదని ఓ పక్క సుప్రీం కోర్టు నెత్తీనోరూ కొట్టుకుంటూ ఉంటే మోదీ సర్కారు మాత్రం అది తప్పనిసరే అని వాదిస్తోంది.

 

ఎట్లాగైనా సరే దాన్ని అన్ని పథకాలకు ముడిపెట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగా అధార్‌ను అనుసంధానం చేసే గడవును మరోసారి పెంచింది.  2018 మార్చి 31 వరకు వరకు సంక్షేమ పథకాల కిందికి వచ్చే వారు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చని బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇది వరకు ఈ గడువు డిసెంబరు 31గా ఉండేది. ఇంతవరకు ఆధార్ లేని వారికి, ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికే ఈ పొడిగింపు వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఆధార్ తప్పనిసరి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని పలు వ్యాజ్యాలు కోర్టులో దాఖలైన సంగతి తెలిసిందే.