టీ20లు వచ్చాక వన్డేలు చూడ్డం తగ్గిపోయింది. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలు మినహా మిగిలిన సిరీస్ లను ఎవరూ పెద్దగా చూడ్డం లేదు.దీంతో వన్డేలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఐసీసీ, క్రికెట్ బోర్డులపై ఉందనేది కాదనలేని సత్యం. ఈ ఫార్మాట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరగాలంటే కచ్చితంగా కీలక మార్పులు చేయాలని మాజీ క్రికెటర్లు అందరూ చెబుతున్నారు. ఇప్పుడున్న 50 ఓవర్ల ఫార్మాట్‌ను 40కు కుదించాలని టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎప్పుడో చెప్పాడు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా అదే మాట అంటుననాడు. వన్డే మ్యాచ్‌లు బోర్ కొడుతున్నాయని చెప్పిన సచిన్ వాటి మీద ఆసక్తి పెంచడానికి సూచనలనూ చేశాడు.
గత కొన్నేళ్ళుగా వన్డే క్రికెట్ ఫార్మాట్‌లో ఎలాంటి మార్పులు లేవు. దీనివల్ల 15వ ఓవర్ నుంచి 40వ ఓవర్ వరకు మ్యాచ్ బోర్ కొడుతోంది. మరోవైపు ఫాస్ట్ క్రికెట్ టి20 ప్రజల్లోకి బాగా వెళళిపోయింది. అందుకే వన్టే ఫ్మార్మాట్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవలసిన టైమ్ వచ్చేసింది. ఇప్పుడున్న ప్రకారం రెండు కొత్త బంతులను ఇవ్వడం వల్ల బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయింది. గతంలో మాదిరిగా రివర్స్ స్వింగ్ చేసే అవకాశం బౌలర్లకు లభించడంలేదు.అందుకే టెస్టు తరహాలో 50 ఓవర్ల క్రికెట్‌నూ రెండు ఇన్నింగ్స్‌లుగా విడదీసి ఆడించాలి. అప్పుడు మ్యాచ్ రసవత్తరంగా మారడంతోపాటు వాణిజ్యపరంగానూ కలిసొస్తుంది. టాస్, మంచు ప్రభావం, పిచ్ పరిస్థితులు ఇరు జట్లకూ అనుకూలంగా ఉండాలి అంటున్నాడు సచిన్ .
టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ పూర్తిగా వేరు కాబట్టి పర్వాలేదు. దాంట్లో వేరే రకం లేదు కనుక దానిని ఏం చేయలేము. కానీ వన్డేల్లోనే ఇంకో ఫార్మాట్ వచ్చి అది సూపర్ సక్సెస్ అయినప్పుడు పాత దాన్ని మార్చడమే సమస్యకు పరిష్కారం అవుతుందని చెబుతున్నాడు సచిన్. ఇప్పటికయినా మార్పులు చేయకపోతే కొన్నాళ్లకు ఎవరూ వన్టేలను చూడరు అని అంటున్నాడు.