టైమ్సాఫ్ ఇండియా హైదరాబాద్ ఎడిటర్ ఔట్.. మీటూ ఎఫెక్ట్.. - MicTv.in - Telugu News
mictv telugu

టైమ్సాఫ్ ఇండియా హైదరాబాద్ ఎడిటర్ ఔట్.. మీటూ ఎఫెక్ట్..

October 13, 2018

సహోద్యోగినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఆయా కంపెనీల యాజమాన్యాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ కేఆర్ శ్రీనివాస్‌ను కొలువు నుంచి తప్పించారు. యాజమాన్యం ఆదేశాలకు మేరకు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే తనను అందరూ టార్గెట్ చేయడంతో పదవి నుంచి తప్పుకున్నట్లు అతడు చెప్పుకుంటున్నాడని అంటున్నారు. ఆరోపణలు రావడంతో అతణ్ని ఇప్పటికే సెలవులపై పంపారు. తాజాగా ఎడిటర్ గిరీ నుంచీ తప్పించారు.

rerer

కేఆర్ శ్రీనివాస్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఏడుగురు మహిళలు ఆరోపించారు. ‘నన్ను లిక్ చేయి.. రుచిగా ఉంటుంది.. అంటూ అతడు మాకు అత్యంత అసభ్య మెసేజీలు పెడుతున్నాడు. సైగలు చేస్తున్నాడు.. మానసికంగా వేధించడంతోపాటు అసభ్యంగా తాకుతున్నాడు..మీద పడుతున్నాడు’ అని అతని చాటింగ్, ఇతర వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతడు తనను మానసికంగా వేధించాడని, సెలవులు తర్వాత తాను తిరిగి విధుల్లో చేరాలంటే భయమేస్తోందని సంధ్యా మీనన్ అనే ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీనివాస్ గోవా రెసిడెంట్ ఎడిటర్ గా పని చేసినప్పుడు తనను కూడా వేధించాడని మరో యువతి తెలిపింది. ఈ మేరకు బాధితులు ఆన్ లైన్‌లో పిటిషన్ పెట్టి, అతణ్ని విధుల నుంచి తప్పించాలని యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు.