గువ్వాగోరింక ఫస్ట్ సాంగ్ అదిరింది ! - MicTv.in - Telugu News
mictv telugu

గువ్వాగోరింక ఫస్ట్ సాంగ్ అదిరింది !

July 4, 2017

‘ గువ్వాగోరింక ’ ఫస్ట్ పాట రిలీజైంది.

నిజంగా ఆ గువ్వా గోరింకలే ఇలా మనుషులగా మారి పాటగా ముచ్చటిస్తున్నాయా అన్నంత తదాత్మ్యం.. సమ్మోహనం.. యూత్ ట్రెండ్ కు గాలం వేసి ఆకట్టుకునే టచబుల్ సాంగ్.. హార్ట్ ను స్మూత్ గా టచ్ చేసి బీట్ కు పరిమళాలు అద్దే పాట.. సురేష్ బొబ్బిలి వినసొంపైన ట్యూన్, మిట్టపల్లి సురెందర్ అన్న మనసుకింపైన లిరిక్స్, విల్సన్ హెరాల్డ్ మీఠా గాత్రం.., వెరసి కమ్మని పాట.. చెవులు పరవశించిపోయే పాట, మిమ్మల్ని ఒక కొత్త ఊహా ప్రపంచంలోకి తీస్కెళ్ళి విహరింపజేసే పాట.. క్యా కరే ఇస్ గానే కి తారీఫ్.. బిల్ కుల్ కిర్రాక్.. బెహెత్రీన్.. పాట వింటూ కప్పులకు కప్పులు కాఫీ తాగేస్తారు.. మీలోని మనిషితో ఎప్పటికీ ఊసులు చెప్తూనే వుంటారు.. ఆ బీట్ అలా మిమ్మల్ని పడుకున్నా, లేచినా, ఏం చేస్తున్నా.., మిమ్మల్ని వెతుకుతుంది.. మీ పెదాలు ఈ పాటను వదలకుండా హమ్ చేస్తూనే వుంటాయి.. మీ మనసు వీణను సుతారంగా మీటుతూ మీతో, మీలో వుండిపోయే ఎవర్ గ్రీన్ సాంగ్ గా మాత్రం నిలిచిపోతుంది. కుచ్ హట్కే గున్ గునాయీకా పహ్ లా పేష్ కష్..వినండి.. వినిపించండి.. వింటూ వీనులవిందు చేస్కుందాం..