ఇంట్లో ఉంటే కరోనా రాదనుకోవద్దు..ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే - MicTv.in - Telugu News
mictv telugu

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకోవద్దు..ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

March 23, 2020

Tips

కరోనా వైరస్ పోవాలంటే స్వీయ నియంత్రణ అవసరం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటూ ఆదేశాలు  కూడా ఇచ్చారు. అన్నట్టుగానే చాలా ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ఈ నియమాలను ప్రజలు పాటిస్తున్నారు.ఇంట్లో ఉన్నాము కదా.. ఇక కరోనా వైరస్ రాదనుకుంటే పొరపడినట్టే. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటికే పరిమితమైనా కూడా కరోనా అంటుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం అంటున్నారు. ఇంకా చెప్పాలంటే బయట ఉన్న వాళ్ల కంటే ఎక్కువగా ఇంట్లో ఉండే వారికే సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. 

ఈ వైరస్ అనేది మనం బయటి నుంచి తెచ్చుకునే వస్తువుల ద్వారా ఇంట్లోకి చేరే అవకాశం ఉంటుంది. పేపర్, పాలప్యాకెట్లు ఇతర సరుకులు తెచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదమని చెబుతున్నారు. అందుకే లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. 

ఏం చేయాలంటే :

  1. ఇతరులతో చేతులు కలపడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు. 
  2. బయట నుంచి తీసుకొచ్చిన వస్తువులను వెంటనే తాకకుండా చేతులకు శానిటైర్ రాసుకొని ముట్టుకోవాలి. 
  3. ఆన్‌లైన్ ఫుడ్ తెప్పించుకోవడం మానేస్తేనే చాలా మందిచిది.
  4. బయటి వ్యక్తులను తరచూ కలవకూడదు, మనిషికి మనిషికి మధ్య కనీసం మీటర్ దూరం ఉండేలా చూసుకోవాలి. 
  5. పాల ప్యాకెట్లు, కూరగాయలు, పండ్లు తెచ్చిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి.
  6. మొబైల్ ఫోన్లు, రిమోట్ కంట్రోల్, కీ బోర్డ్స్ తరుచూ శుభ్రం చేసుకోవాలి.

7.బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి చేతులు శానిటైజర్స్‌తో శుభ్రం చేసుకోవాలి.

  1. అత్యవసర సమయాల్లో తప్ప బయటకు వెళ్లకూడదు, ఒకవేళ వెళ్లిని వెంటనే స్నానం చేయాలి. 
  2. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. 
  3. జలుబు, జ్వరం లాంటివి ఏ మాత్రం అనిపించినా వెంటనే వైద్యులను సంప్రధించాలి.