సెక్సీ అన్న పదం చాలా పర్సనల్. ఎవరికి ఏది సెక్సీగా కనిపిస్తుందో, ఎవరికి ఎందుకు మూడ్ వస్తుందో ఎవరూ చెప్పలేరు. అసలు సెక్సీ అన్న పదాన్ని బూతుగానే చూడక్కర్లేదు. అదొక రొమాంటిక్ ఫీలింగ్. ఒక చూపు, నవ్వు, నడక, కట్టిన చీర, కొన్ని అలవాట్లు…ఇలా చాలా వాటికి మనసూ, శరీరం స్పందిస్తూ ఉంటాయి. అయితే, ఇవి ఇద్దరికీ తెలిసినవే అయి ఉంటాయి. కొన్ని సార్లు స్త్రీలు చేసే కొన్ని మామూలు పనుల వల్ల కూడా మగవారు వారికి ఎట్రాక్ట్ అవుతారట. మరి ఆ పనులేమిటో మీకు తెలుసా.
నవ్వు:
ఆడవాళ్ళు నవ్వితే మగవాళ్ళు పడిపోతారు.అతని జోకులకి నవ్వుతూ ఉంటే చాలా ఇష్టంగా ఉంటుందట. బహుశా అందుకేనేమో, పిచ్చి జోకులు అని తెలిసినా కూడా ఒక్కోసారి అవే జోకులు మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటారు, మీ నవ్వు చూడడం కోసం, ఆ నవ్వుని ఆనందించడం కోసం.
పిల్లలతో ఆటలు:
మీ పిల్లలతోనే కాదు, ఎవరి పిల్లలతో అయినా వనితలు ఆడుకుంటే మగవారికి ఎంతో ఇష్టమట. స్త్రీలో ఉన్న తల్లి హృదయం పట్ల వారు ఆకర్షితులవుతారట. ఎంత కమిట్ అవ్వకుండా ఉందామనుకున్న వారైనా సరే, ఆ నిమిషానికి ఎట్రాక్ట్ అవ్వకుండా అయితే ఉండలేరు అంటున్నారు మానసిక నిపుణులు.
వర్కౌట్స్:
కొన్ని వర్కౌట్స్ ఉంటాయి, అవి చేయాలంటే ఎంతో బలం, ఓపిక, పట్టుదల కావాలి. అలాంటి వర్కౌట్స్ చేస్తూ కూడా ఫెమినైన్‌గా కనిపించే ఆడవాళ్ళంటే మగవారికి ఎంతో ఇష్టమట. అలాంటి వర్కౌట్స్‌లో ఒకటి కెటిల్ బెల్ స్వింగ్. అలాగే వాళ్ళతో కలిసి జిమ్ కి వెళ్ళడం, వాకింగ్ లాంటివి చేస్తే కూడా మగవారికి బాగా న్చుతుంది.
తల పక్కకి వంచి చూడడం..
కుక్క పిల్లలు అలా తల పక్కకి వంచి అమాయకంగా చూస్తే అందరికీ ఇష్టమే. అదే చూపు అమ్మాయిలు చూస్తే, అబ్బాయిల మనసుల్లో ఏం జరిగిపోతూ ఉంటుందో చెప్పడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు.
కాఫీ, టీ:
కాఫీ, టీ, కూల్‌డ్రింక్.. ఏదైనా సరే, స్లో గా సిప్ చేస్తూ తాగుతూ ఉంటే మగవారు పడిపోతారట. వారికి మంచి మూడ్ వచ్చేస్తుందట.
టాటూ:
మీరు ఏదైనా టాటూ వేయించుకుని దాని వెనకాల ఉన్న కధ చెబుతూ ఉంటే మగవారు మైమరిచిపోయి వింటారట. శరీరాన్ని కాన్వాస్ లాగా మార్చుకున్నారు అంటే అది ఎంత ముఖ్యమైతే అలా చేస్తారు అనుకుని అమ్మాలయితో ప్రేమలో పడిపోతారు.
స్పోర్ట్స్:
వంట, మేకప్, అందంగా కనపడడం, ఉద్యోగం, చదువు లాంటి విషయాలే కాక స్పోర్ట్స్‌లో ఆడవాళ్ళకు ప్రవేశం ఉన్నా, ఏదైనా ఆట గురించి బాగా తెలిసి ఉన్నా, మగవారికి ఎంతో ఇష్టంగా ఉంటుందట. ఆడవాళ్ళు క్రీడల గురించి మాట్లాడుతుంటే మగవారు మైమరచిపోయి వింటారు అని చెబుతున్నారు.