బస్‌స్టాప్‌లో డ్యాన్స్ వేసిన టిరెల్లి.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

బస్‌స్టాప్‌లో డ్యాన్స్ వేసిన టిరెల్లి.. వీడియో వైరల్

March 21, 2022

ఇంగ్లండ్ దేశంలోని లివర్ పూల్ సిటీలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతేకాదు ఆ వీడియోను వీక్షిస్తున్న వారందరూ పడిపడి నవ్వుకుంటున్నారు. ఎందుకు ఆ వ్యక్తి అంతలా డ్యాన్స్ వేస్తున్నాడు? డ్యాన్స్ చేయడానికి గల కారణం ఏంటీ? అనే వివరాల్లోకి వెళ్తే.. ఓర్లాండో టిరెల్లి అనే వ్యక్తి ఏదో పనిమీద హడివుడిగా బస్‌స్టాప్‌కు వచ్చాడు. బస్సు ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురుచూస్తూ కుర్చున్నాడు. చాలా సమయం గడిచింది. అయినా బస్సు రావడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక తనలోని కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం రోడ్డుపై వాహనాలు, జనాలు వెళ్తున్న అవేవి పట్టించుకోకుండా డ్యాన్స్ వేశాడు.

ఈ సందర్భంగా హేలీ లూయీ అనే మహిళ ఈ లివర్ పూల్ వీడియోను తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ..” నేనే ఆ వీడియో తీశాను. జస్ట్ జనం మొహాల్లో చిరునవ్వుల కోసమే ఆ వీడియో తీసి, పోస్ట్ చేశాను. కానీ ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు. ఆ వ్యక్తి మా జిమ్‌కే వస్తాడు. ప్రపంచంలో ఎవరూ లేరన్నట్టుగా అతడు డ్యాన్స్ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అది కనులవిందుగా అనిపించింది. అందుకే వీడియో తీశాను” అని హేలీ లూయీ తెలిపింది.

ఈ క్రమంలో ఆ వీడియోను వీక్షించిన ఆ వ్యక్తి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ డ్యాన్స్ చేసింది తానేనని ఓర్లాండో టిరెల్లి అనే వ్యక్తి రిప్లై ఇచ్చాడు. తన డ్యాన్స్‌ను వీడియో తీస్తున్నారన్న సంగతే తనకు తెలియదని, ఎలాగైతేనేం తనను అంతలా వైరల్ చేసినందుకు ఆనందంగా ఉందని అన్నాడు. తన డ్యాన్స్‌తో చాలా మంది మోముల్లో ఆనందం, నవ్వులు వెల్లివిరుస్తాయంటే అంతకన్నా కావాల్సిందేముంటుందని హర్షం వ్యక్తం చేశాడు.