తిరుమల వెంకన్న దేవేరి అయిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆయంలో ప్రధానార్చకుడిగా పనిచేస్తున్న ప్రతాపస్వామిపై కేసు నమోదైంది. ఓ వ్యాపారిని ఆత్మహత్యకు పురికొల్పారంటూ ఫిర్యాదు రావడంతో స్వామిపై, ఆయన భార్య వాణి పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరూ పరారైనట్లు తెలుస్తోంది. చిట్టీ వ్యాపారంలో కోట్లు ఎగ్గొట్టినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
స్వామి, వాణిలు గుడి పనితోపాటు సైడ్ బిజినెస్‌గా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. స్థానిక ఎస్వీపీ కాలనీకి చెందిన నితిన్ సింగ్ అనే కిరాణా వ్యాపారి వారి దగ్గ చిట్టీలు వేశారు. ఇంటికి దగ్గర్లోనో ఉండడం, పైగా టీటీడీ ఆలయంలో పనిచేస్తుండడంతో స్వామి మోసం చేయడని భావించాడు. అయితే చిట్టీ పూర్తయి మూడేళ్లు దాటిపోయినా స్వామి దంపతులు నితిన్‌కు డబ్బులు ఇవ్వలేదు. అడిగితే రేపో మాపో అని తప్పించుకుని తిరిగారు. మరోపక్క వ్యాపారం దెబ్బతినడం, మానసిక వేదనతో నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం స్వామి దంపతులేనని నోట్ రాశాడు. అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.