Tirumala Hundi Income Crossed RS 1000 Crores..TTD Taget Reach 3 Months Before
mictv telugu

వందల కోట్ల ఆదాయం సరే..తిరుమలలో సౌకర్యాల మాటేమిటి?

December 3, 2022

Tirumala Hundi Income Crossed RS 1000 Crores..TTD Taget Reach 3 Months Before

ఇది తిరుమల హుండీ రికార్డ్ ఆదాయం.వరుసగా 9 నెల రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ వార్షిక సంవత్సరంలో హుండీ ఆదాయం రూ.1000 కోట్లు వస్తుందని టీటీడీ అంచనా వేసింది. కానీ మూడునెలల ముందే అంచనాకు మించి హుండీ రికార్డ్ సృష్టించింది. దీంతో టీటీడీ అంచనాను సవరించి రూ.1600 కోట్లకు టీటీడీ మార్చింది.హుండీ ఆదాయం ఓకే.కానీ భక్తుల సౌకర్యాల మాటేమిటి?కొండపై భక్తుల కష్టాల సంగతేంటి? రద్దీ సమయాల్లో భక్తుల వసతి సౌకర్యాలు సరిగ్గానే ఉంటున్నాయా?వేగంగా దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏం చేస్తుంది..?

రికార్డుల హుండీ…

రికార్డ్ స్థాయి హుండీ ఆదాయం టీటీడీ బాధ్యతల్ని పెంచింది.వరుసగా తొమ్మిదో నెల వందకోట్లు దాటింది. మార్చి1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వరకు హుండీ ద్వారా రూ.1000 కోట్లు వస్తుందని టీటీడీ అంచనా వేసింది. అంచనాలకు మించి ఈ టార్గెట్ మూడు నెలల ముందే రీచ్ అయింది. ప్రతినెల రూ.100కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. నవంబర్‌లో ఏకంగా రూ.127.30 కోట్ల ఆదాయం వచ్చింది.

లక్ష నుంచి 100 కోట్ల దాకా

1950 వరకు శ్రీవారికి హుండీ ద్వారా రోజుకు లక్ష రూపాయలలోపు ఆదాయం వచ్చేది. 1958లో తొలిసారిగా లక్షదాటింది. 1990ల నాటికి అది కోటి రూపాయలకు పెరిగింది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తుంది. 2021లో రూ.731 కోట్లు వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో అది మరింత పెరిగింది. రూ.931 కోట్లకు వార్షిక ఆదాయం చేరింది. ఈ వార్షిక సంవత్సరంలో రూ.1000 కోట్లు అంచనా వేయగా మూడు నెలల ముందే దాటింది. దీంతో టీటీడీ అంచనాలను సవరించి రూ.16 వందల కోట్లకు పెంచింది.

భక్తుల సౌకర్యాల మాటేమిటి?

హుండీ ఆదాయం పెరిగింది. మరి భక్తుల సౌకర్యాలపై టీటీడీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రద్దీ సమయాల్లో భక్తుల కంట్రోల్ కోసం మరిన్ని చర్యలు చేపట్టాలి. దర్శనంకోసం వేచిచూసే సమయాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. అలాగే దేవుడ్ని చూసే సమయంలో తోసేయకుండా కొన్ని సెకన్ల పాటు ఉండేలా ప్లానింగ్ చేయాల్సిన ఎంతైనా ఉంది. సెలవు దినాల్లో దర్శనానికి 48 గంటలు కూడా పడుతుంది. దీన్ని ఎలా తగ్గించాలో టీటీడీ ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ఆ క్షణంకోసం

ఏడుకోండలవాడా..వెంకట రమణ గోవిందా గోవిందా అంటూ శ్రీవారి దర్శనం భక్తులు వస్తారు. వెంకన్న దర్శనం కాగానే పులకించిపోతారు. ఈ క్షణం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తారు. తిరుమల దర్శనానికి అనువుగా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులు ఎప్పటినుంచో కోరుతున్నారు. అలిపిరి నుంచి ఆనంద నిలయం వరకు ఎదురయ్యే అన్ని సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నారు. రద్దీని టీటీడీ ముందే అంచనా వేసి అసౌకర్యాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. నడకదారిన వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించాలి. క్యూలెన్లలో గంటలకొద్దీ వేచి ఉన్న భక్తులకు టిఫిన్ ,పాలు , మజ్జిగ అందరికి అందేలా చూడాలి. అన్నదాన కౌంటర్లని పెంచాలని భక్తులు కోరుతున్నారు. వికలాంగులు, వృద్దులకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలి. రద్దీ పెరిగితే భక్తుల వసతికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తిరుమలలో ఏడు వేల గదులు ఉన్నాయి. 45 వేల మందికి వసతులు కల్పించవచ్చు. ఇందులో వెయ్యి గదులు వీఐపీలకు కేటాయిస్తున్నారు. 1650 గదుల్ని ఆన్ లైన్ రిజ్వరేషన్ ద్వారా కేటాయిస్తారు. 250 గదులు దాతలకు కేటాయిస్తారు. మిగిలిన వాటిని కరెంట్ బుకింగ్ కింద ఇస్తారు. అయినాసరిపోయేంత గదులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భక్తులు క్యూ క్లాంపెక్స్ , బస్టాండ్లు, రోడ్లపైనే నిద్రించాల్సి వస్తుంది.టీటీడీకి అంచనాకు మించి హుండీ ద్వారా ఆదాయం వస్తుండటంతో వసతి గదులు ఇంకా నిర్మించాల్సిన అవసరం ఉంది. భక్తులకు వేగంగా దర్శనం అయ్యేలా చూడాలి. వస్తుల వందల కోట్ల హుండీ ఆదాయంలో భక్తుల సౌకర్యాలకే పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.