తిరుమలలోని ఏడుకొండల స్వామి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. గతంలో మున్నెన్నడు లేనివిధంగా మేనెలలో రూ. 139 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఒక్క నెలలో ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం టీటీడీ చరిత్రలో మొదటిసారన్నారు. సుమారు 22.62లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని వివరించారు. కాగా భక్తుల సౌకర్యార్ధం టైంస్లాట్ సర్వదర్శన విధానం పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, . త్వరలోనే టైమ్ స్లాట్ టోకెన్లను భక్తులకు జారీ చేస్తామని చెప్పారు. 2019లో టీటీడీ పథకాలకు 308 కోట్లు రాగా 2021లో రూ.564 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు.