దేశంలో అత్యధికంగా భక్తులు దర్శించుకున్న దేవాలయంగా తిరుమల రెండో స్థానంలో నిలిచింది. ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ ప్రకారం వారణాసి మొదటి స్థానంలో ఉంటే.. ద్వితీయ స్థానాన్ని తిరుమల దక్కించుకుంది. అదేవిధంగా తిరుమలలో పర్యటకుల గదుల బుకింగ్ గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం గణనీయంగా పెరిగాయి. గతేడాదికి ఇప్పటికీ 233 శాతరం పెరిగి నట్టు ఓయో రిపోర్ట్ తెలింది. ఈ విషయంలో తిరుమల మొదటి స్థానంలో ఉండగా వారణాసి, షిర్డీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా భక్తులు సందర్శించిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై నిర్వహించిన సర్వే అనంతరం ఈ నివేదికను విడుదల చేసింది.
కరోనా ఆంక్షలు తరువాత ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. రెండు సంవత్సరాలు కరోనా కారణంగా స్వామివారి దర్శనానికి వీలుకాకపోవడంతో గత సంవత్సర నుంచి ఆలయానికి భారీగా తరలివస్తున్నారు. ఏడు కొండలు కిక్కిరిసి పోతున్నాయి.క రోనా లాక్డౌన్ కారణంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం 84 రోజుల పాటు మూసివేయబడింది. సంవత్సర కాలంగా తిరుమలలో విధించిన కరోనా లాక్డౌన్, ఆ తర్వాత తిరుమలకు భక్తులు పెద్దగా రాలేదు. కరోనా నిబంధనలు, భక్తులను అధిక సంఖ్యలో అనుమతించకపోవడం వంటి అనేక కారణాలతో స్వామివారి దర్శనానికి భక్తులు దూరమయ్యారు. అనంతరం పరిస్థితులు చక్కబడడంతో భారీగా తరలివస్తున్నారు.