తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి 23 నుంచి 28వ తేదీ వరకు సంబంధించి రూ. 300ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. భక్తుల యాప్ ద్వారా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవాలని తెలిపింది. వ్రుద్ధులు, దివ్యాంగుల కోట టోకెన్లను ఈనెల 14న ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. ఇక అంగ ప్రదక్షిణంకు సంబంధించి ఈనెల 23 నుంచి 28 వరకు గల టోకెన్లను శనివారం ఉదయం 11గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ.