తిరుమల గుడిపై అపచారం.. ఆ విమానం ఎవరిదంటే. - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమల గుడిపై అపచారం.. ఆ విమానం ఎవరిదంటే.

February 5, 2020

తిరుమల గుడిపై నిబంధనలకు విరుద్ధంగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం.. దేవుడిపైన మనుషులు సంచరించకూడదు. అలాంటిది ఏకంగా విమానంలో మనుషులు చక్కర్లు కొట్టేస్తున్నారు. తిరుమల గుడి ప్రాంతాన్ని ప్రభుత్వం ‘నో ఫ్లైయింగ్‌ జోన్‌’గా ప్రకటించింది. 

అయితే సర్వే ఆఫ్‌ ఇండియా(ఎస్‌వోఐ) విమానం ఒకటి రెండు రోజులుగా గుడిపై తిరుగుతోంది. భౌగోళిక పరిస్థితులపై అంచనా కోసం ఈ సర్వే చేస్తున్నారని తెలుస్తోంది. అయితే వెంకన్న గుడిపై విమానాలు వెళ్తొద్దన్న ఆదేశాలను తుంగలో తొక్కడడం సబబు కాని టీటీడీ మండిపడుతోంది. గతంలోనూ ఈ వ్యవహారంపై  ఏవియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేశామని అయినా ఫలితం లేకపోయిందని అధికారులు వాపోతున్నారు. తాజాగా మళ్లీ విమానం తిరగడంపైనా వారు దగ్గర్లోని చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ ఫిర్యాదు చేశారు. తిరుమలలోకి విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది.