8 నుంచి వెంకన్న దర్శనం..
వెంకన్న దర్శనం కోసం ఆశగా ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్తను వినిపించింది. జూన్ 8 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో భక్తులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల దర్శనాని కంటే ముందు ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈలోపు టీటీడీ ఉద్యోగులు, స్ధానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్సనం కల్పించాలని నిర్ణయించారు. శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ అందుబాటులోకి తెచ్చారు. కాగా 70 రోజులుగా స్వామి వారి దర్శనానికి భక్తులు దూరమయ్యారు. తాజాగా కేంద్రం ఆలయాలు, చర్చిలు, మసీదుల్లోకి భక్తులకు ప్రవేశానికి అనుమతి ఇవ్వడంతో జూన్ 8 నుంచి తిరుమలలో కూడా దర్శనం ప్రారంభంకానుంది.