వైవీ సుబ్బారెడ్డికి కరోనా.. మంత్రికి సీరియస్! - MicTv.in - Telugu News
mictv telugu

వైవీ సుబ్బారెడ్డికి కరోనా.. మంత్రికి సీరియస్!

October 15, 2020

mbmhmj

ఇప్పటికే పలువురు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, పూజారాలు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెల్సిందే. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

అలాగే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. గత నెలలో తిరుమలలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం జగన్‌తో కలిసి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తరువాత కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో  విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 8న విజయవాడలోని పాఠశాల విద్యార్దులకు జగనన్న విద్యాకానుక అందించారు. ఇప్పుడు మరోసారి అనారోగ్యం పాలయ్యారు.