టీటీడీ హుండీ లెక్కింపు ఇక ప్రైవేటుకు.. పారదర్శకతపై సందేహాలు - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ హుండీ లెక్కింపు ఇక ప్రైవేటుకు.. పారదర్శకతపై సందేహాలు

April 10, 2018

ఎయిర్ ఇండియా మొదలుకుని రోడ్ల నిర్వహణ వరకు అన్నీ ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్న కాలం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ బాట పట్టింది. కోట్లాది మంది భక్తులు కానుకలతో కళకళలాడే హుండీ లెక్కింపును ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించాలని వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పరకామణి లెక్కింపు బాధ్యతలను ఓ రాజకీయ నేతలకు సన్నిహితంగా మెలికే  ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టనున్నారు. దీనిపై ప్రజలు, విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పారదర్శకత లోపిస్తుందని, కానుకలు పక్కదారి పడతాయని ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం లెక్కింపు పారదర్శకంగా

వెంకన్న హుండీ కానుకలను లెక్కింపు ప్రస్తుతం పాదర్శకంగానే జరుగుతోంది. కొన్ని లోటుపాట్లు ఉన్నా సీసీకెమరాల నిఘా ఉండడంతో అక్రమాలు వెంటనే బయటపడతున్నాయి. హుండీలో వేసే కరెన్సీ, బంగాం, వెండి కానుకలను టీటీడీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు లెక్కిస్తుంటారు. గర్భగుడి పక్కనే ఉన్న పరకామణిలో ఈ ప్రక్రియ జరుగుతోంది. వివరాలను రికార్డుల్లోకి ఎక్కిస్తున్నాయి. లెక్కించo వారు స్వచ్ఛందంగా ఈ సేవ చేస్తుంటారు. ఇప్పుడు ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే లెక్కింపు పారదర్శకంగా జరగకపోవచ్చు. సీసీ కెమరాల నిర్వహణ కూడా ఆ కంపెనీకే అప్పగించాల్సి వస్తుంది. రికార్డుల వివరాలపైనా సందేహాలు కలిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టొద్దని టీటీడీ ఉద్యోగులు కూడా కోరుతున్నారు. కానీ కొందరు పెద్దలు పావులు కదపడం, అధికార పక్షం కూడా ‘ప్రైవేటు’పై సుముఖంగా ఉండడంతో త్వరలోనే లెక్కింపు టీటీడీ చేయిజారిపోనుంది..