కంటైన్మెంట్‌ జోన్‌గా తిరుమల - MicTv.in - Telugu News
mictv telugu

కంటైన్మెంట్‌ జోన్‌గా తిరుమల

July 9, 2020

 nvmn

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకి సగటున 1500 కేసులు నమోదువ్వుతున్నాయి. వెంకన్న కొలువై ఉన్న తిరుమలలో కూడా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలను ‘కంటైన్మెంట్ జోన్’ గా ప్రకటించారు.

చిత్తూరు జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయినా కూడా  వెంకన్న సన్నిధి మాత్రం తెరిచే ఉంటుందని ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనాన్ని మర్చి 22 నుంచి నిలిపేసిన విషయం విదితమే. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తరువాత తిరిగి దర్శనానికి అనుమతినిచ్చారు. మొదట్లో రోజుకు కేవలం 6,000 మంది భక్తులకు మాత్రమే అనుమతినిచ్చిన బోర్డు.. ప్రస్తుతం 12,000 మంది భక్తులకు అనుమతినిచ్చింది.