ప్రసిద్ద దివ్య క్షేత్రం తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా…?అద్దె గదుల కోసం తిప్పలు తప్పవనుకుంటున్నారా..? గంటల కొద్దీ క్యూ లో నిలపడాలని టెన్షన్ పడుతున్నారా..? ఇక ఆ ఇబ్బందులు అవసరం లేదంటోంది టీటీడీ..ఎందుకంటే…
తిరుమలలో అద్దె గదుల కేటాయింపులో టీటీడీ అధికారులు కొత్త విధానాన్ని బుధవారం అమల్లోకి తెచ్చారు. టోకెన్ల పద్ధతిలో భక్తులకు గదులను కేటాయించే ప్రక్రియను చేపట్టారు. టోకెన్ల మంజూరుకు సీపీఆర్వో గదుల కేటాయింపు దగ్గర 10 కౌంటర్లను ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. ఈ టోకెన్ల మంజూరుకు ఎంబీసీ-34 దగ్గర ఒక కౌంటర్ పెట్టారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆధార్, వేలిముద్ర, మొబైల్ నెంబర్ ద్వారా ఈ టోకెన్ల నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. గది కేటాయంపు సమయాన్ని ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ఎంఎస్ పొందిన అరగంటలోపే గదిని కేటాయించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సో ఇక ముందు తిరుమల వెళ్లాక అద్దెగదుల కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా శ్రీ వేంకటేశ్వరస్వామీని దర్శించుకోవచ్చన్న మాట.