Tirupat Timumala like god Vip vvip break darhan in Yadadri temple
mictv telugu

యాదాద్రిలో తిరుమల తరహా బ్రేక్ దర్శనాలు…

November 1, 2022

లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెర తీసింది. తిరుమల ఆలయంలో మాదిరి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలను సోమవారం నుంచి ప్రారంభించింది. సాధారణ భక్తులను నిలిపేసి స్పెషల్ టికెట్లు తీసుకున్నవాళ్లకు స్వామి దర్శనం చేయిస్తారు. రోజూ పొద్దున 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు రెండు గంటలపాటు ఈ బ్రేక్ దర్శనాలు ఉంటాయి. యాదాద్రికి భక్తులు పోటెత్తుండడం వీవీఐపీలు, వీఐపీల భద్రత వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. కాగా తొలి కార్తీక సోమవారం సందర్భంగా బ్రేక్ సందర్భనాలో రూ. 87,600 ఆదాయం గుడికి వచ్చింది. ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం రానుండడంతో ఆ రోజు యాదాద్రిలోని ప్రధాన, అనుబంధ ఆలయాలు మూత పడనున్నాయి.